మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా పవర్ స్టార్ గా ఎదిగిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ దక్కించుకొని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అన్న రేంజ్ లో పవన్ కళ్యాణ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు వెళ్లి కొంత విరామం తీసుకొని మళ్లీ సినిమాల్లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా పూర్తవగానే తన తదుపరి సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ వరస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ఈ నేపథ్యంలోనే క్రిష్ దర్శకత్వంలో హరి హరి వీరమల్లు అనే సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అంతేకాకుండా సాగర్ చంద్ర దర్శకుడిగా త్రివిక్రమ్ రచయిత గా తెరకెక్కుతున్న మలయాళం సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇందులో రానా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు.  వచ్చే సినిమా సంక్రాంతికి సినిమా వస్తుందని ఇటీవలే సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, నిత్యామీనన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు.

ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ రెండు చిత్రాలే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రం చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా రాగా ఆ సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో పవన్ మేనియా తగ్గినట్లుగా కొంతమంది వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే టీవీలో వకీల్ సాబ్ సినిమా దానికి తక్కువ టిఆర్పి రేటింగ్ రావడంతో ఒక్కసారిగా పవన్ క్రేజ్ తగ్గినట్లుగా ప్రచారం చేస్తున్నారు. పవన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై ఈ ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఇక సురేందర్ రెడ్డి, డాలీ, పూరి జగన్నాధ్ లతో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: