తమిళనాట వరుస సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకుని అక్కడ స్టార్ హీరోగా ఉన్నాడు హీరో ఆర్య. తెలుగు లో వరుడు సినిమాతో విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత హీరోగా పలు తమిళ సినిమాలను అనువదించి ఇక్కడ కూడా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. ఆ తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా చేసేంతగా మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్నాడు ఆర్య. తాజాగా ఆయన తన సినీ కెరీర్ గురించి సినిమా పరిశ్రమ లోకి ఎలా వచ్చాను అన్న దాని గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆర్య అనుకోకుండా సినిమా పరిశ్రమ లోకి వచ్చాడు. కేరళకు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆర్య బిజినెస్ కారణంగా కుటుంబంతో సహా చెన్నై కి వచ్చి స్థిరపడ్డారు. ఇంట్లో ఆర్థిక కారణాల వల్ల డబ్బులు సరిపోక కొన్నేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఆర్య ఆ తర్వాత సినిమాల్లోకి అనుకోకుండా ప్రవేశించాడు. 12బి వంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన జీవన్ తన కొత్త సినిమా కోసం నటీ నటులకు వెతుకుతుండగా ఆర్య తారసపడ్డాడు. ఓరోజు మసీదులో ఆర్యని చూసి ఆ దర్శకుడు తను అనుకున్న పాత్రకి అతను సరిపోతాడని స్క్రీన్ టెస్ట్ కి రమ్మని పిలిచాడు. 

గాల్లో తేలుతూ అక్కడికి వెళ్ళిన ఆర్య కు చేదు అనుభవం ఎదురైంది. నవ్వడం కూడా రావడం లేదని ఆయన చెప్పడంతో నటుడు కావాలనే కోరిక బలంగా గా మారి ఎంతో కష్టపడి దానినీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా సినిమాలు చేసి స్థిరపడ్డాడు. తన కెరియర్ లో అర్యకి మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా నేనే దేవున్ని. ఆ సినిమా చేసేదాకా తనను తాను ఏంటో తెలుసుకోలేకపోయాడట ఆర్య. ఈ సినిమా కోసం తిండి తిప్పలు మానేసి 20 రోజులు గంటల సాధన చేశాను. అన్నారు.  అఘోర సాధువుల దగ్గరే ఉన్నాను. డూప్ లేకుండా శీర్షాసనం చేయాలి అని చెప్పడంతో యోగా మాస్టర్ ని సంప్రదించాను. రెండు వారాలపాటు సాధన సాధించగలిగాను. మూడు రోజులు అక్కడ శవాల మధ్య నన్ను కూర్చోబెట్టి అఘోర సాధువులను గమనిస్తూ ఉండమన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: