దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార స్థాయికి అనసూయ స్థాయికి ఏమాత్రం పోలిక ఉండదు. అయితే అనసూయకు నయనతార పోషించవలసిన పాత్రలో నటించే అవకాశం వచ్చిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికికారణం అనసూయ చిరంజీవి నటిస్తున్న ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ మూవీలో ఒక కీలక పాత్రకు ఎంపిక అయింది అన్నవార్తలు వస్తున్నాయి.


ఒక ప్రముఖ జాతీయ దినపత్రికకు అనసూయ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చిరంజీవి పక్కన ‘గాడ్ ఫాదర్’ మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయాన్ని తెలియ చేసింది. తాను ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి పక్కన సినిమాలలో నటించే అవకాశం గురించి ఎదురు చూస్తున్నానని ఇప్పుడు ఆ అవకాశం తనకు దక్కినందుకు ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈన్యూస్ వైరల్ గా మారింది.


వాస్తవానికి ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. చిరంజీవి పట్టుపట్టి కీలకమైన ఆపాత్రను నయనతార తో చేయించాలి అని పట్టుపట్టాడు అని అంటారు. అయితే నయతార ఆపాత్రలో నటించడానికి 4 కోట్ల పారితోషికం అడిగింది అన్నవార్తలు కూడ వచ్చాయి. ఇప్పుడు హఠాత్ గా అనసూయ ఈమూవీ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కావడంతో నయనతార స్థానాన్ని అనసూయ భర్తీ చేస్తుందా అన్నసందేహాలు వస్తున్నాయి.


‘లూసీఫర్’ రీమేక్ గా నిర్మించబడుతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి చెల్లెలు పాత్ర చాల మానసిక సంఘర్షణతో ఉంటుంది. దీనితో అలాంటి పాత్రకు నయనతార న్యాయం చేస్తుందని భావించారు. అయితే ఇప్పుడు ఈమూవీ కథలో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా అనేక మార్పులు జరిగిన పరిస్థితులలో అనసూయ పోషిస్తున్న పాత్ర నయనతార పోషించే చెల్లెలు పాత్ర అనుకోవాలా లేదంటే మరొక పాత్రను క్రియేట్ చేసారా అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనసూయకు ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్త పాత్ర ట్రెండ్ సెటర్ అయినట్లుగా ఇప్పుడు అనసూయకు ‘గాడ్ ఫాదర్’ మూవీ కూడ కీలకం కాబోతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: