ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు మాస్ రాజా రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తో రవితేజ తో పాటు ఇటు శ్రుతిహాసన్ గోపీచంద్ మలినేని ఇద్దరు కూడా మంచి కం బ్యాక్ చేశారు. దీనికి ముందు వరుస ప్లాపులతో ఉన్న రవితేజ ఇప్పుడు క్రేజీ హీరోగా మారాడు అని చెప్పవచ్చు క్రాక్ సినిమాతో. ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

అంతేకాకుండా శరత్ మండవ అనే దర్శకుడితో కలిసి రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇలా ఒక సినిమా హిట్ తో రెండు సినిమాల ను సెట్స్ పైకి తీసుకువెళ్ళి శరవేగంగా ఈ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే రవితేజ మరొక దర్శకుడితో సినిమా చేయాలని భావిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా చేయనున్నాడని వార్తలు రాగా ఎంతకీ సినిమా పట్టాలు ఎక్కకపోవడం ఆయనను నిరాశ పరిచింది. కథ కారణంగా రెమ్యూనరేషన్ కారణంగా బడ్జెట్ కారణంగా ఇన్నాళ్ళు ఈ సినిమా వాయిదా పడుతూ రాగా ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కుతోంది అనే వార్త టాలీవుడ్ లో వినిపించింది.

అయితే మళ్లీ ఈ సినిమాకు ఓ సమస్య వచ్చిందట. త్రినాథరావు నక్కిన తాజాగా తయారు చేసిన కథలో ఓ పాయింట్ మిస్ అయిందని రవితేజ సూచించడంతో మళ్లీ దాన్ని రిపేర్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా కథ విషయంలో రవితేజ మార్పులు చెప్పగా ఈ విషయంలో ఇద్దరికి పడటం లేదని మాత్రం అర్థం అవుతుంది. మరి ఇన్నిసార్లు కథలో మార్పులు చేసిన తర్వాత అది ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియదు కాబట్టి రవితేజసినిమా చేయడం అవసరమా అని ఆయన అభిమానులు ఆయనకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: