దగ్గుబాటి హీరోలకు సెప్టెంబర్ 20వ తేదీ  ఎంతో స్పెషల్ కానుంది.ఎందుకంటే దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ తను నటించబోయే సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ తేదీన విడుదల కానుంది.అంతే కాకుండా అదే రోజు రానా తన కొత్త సినిమా నుంచి అప్డేట్ కూడా ఇవ్వనున్నాడు.అయితే సెప్టెంబర్ 20వ తేదీన బాబాయ్ ఇంకా అబ్బాయి ఇద్దరూ కలిసి దగ్గుబాటి అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నారు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబాయ్.. అబ్బాయ్ ఇద్దరూ కలిసి తెలుగులోనే కాకుండా  మలయాళంలో కూడా సూపర్ హిట్ చిత్రాలకు రీమేక్ చేస్తున్నారట.

వెంకటేష్ నటించిన దృష్టం సినిమా మలయాళంలో సూపర్ హిట్  అందుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా  ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్నటువంటి "దృశ్యం 2 "చిత్రంలో కథానాయకుడు రాంబాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు.అయితే ఈ సినిమా సెప్టెంబర్  20వ తేదీ ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నారు.ఇదే కాకుండా మలయాళంలో పెద్ద హిట్ అందుకున్న  "అయ్యప్పనుమ్ కోషియుమ్" కి రీమేక్ గా తెలుగులో వస్తున్న సినిమా భీమ్లా నాయక్ చిత్రంలో రానా డానియల్ శేఖర్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20వ తేదీన డానియల్ శేఖర్ పాత్రకు..

 సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని..రానా అభిమానులు కోరడంతో ఫస్ట్ లుక్ ను బ్లిట్స్ ఆఫ్ డేనియల్ శేఖర్ పేరుతో గ్లింప్స్ గా విడుదల చేయబోతున్నారు.ఇలా అబ్బాయ్.. బాబాయ్  సినిమాల నుంచి అప్డేట్స్ ఒకే రోజు రావడం వీరి అభిమానులకు పండగ అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటె ఈ బాబాయ్ అబ్బాయి లు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే సరైన కథ దొరికితే చేయడానికి అటు వెంకీ, ఇటు రానా ఇద్దరూ కూడా రెడీగా ఉన్నారు.మరి ఈ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: