బాలీవుడ్ లో కొందరి ప్రేమలు పెళ్లి పీఠల దాకా వెళ్లడం లేదు. ఏదో బైక్ లు.. కార్లు మార్చినట్టు లవర్స్ ను మారుస్తున్నారు. మ్యారేజ్ చేసుకుంటారులే.. అనుకునే లోపే.. జనాలకు ఝలక్ ఇచ్చి ఇంకొంకరితో రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఇలాంటి వాళ్లలో సిద్ధార్థ్ మల్హోత్రా ఒకరు. ఈ హీరో కియారా అద్వానీతో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాడని బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. వీరిద్దరి బంధం గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా గట్టిగా వినిపించింది. ఇదే విషయం గురించి సిద్దార్థ్‌ని అడిగితే చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.    

సిద్ధార్థ్ మల్హోత్రా బ్లాక్‌బస్టర్ సినిమాల కంటే లవ్‌స్టోరీస్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో కెరీర్‌ స్టార్ట్ చేసిన సిద్ధార్థ్‌ ఫస్ట్‌ బాలీవుడ్ లవ్‌ కూడా ఇక్కడే మొదలయింది. ఆలియా భట్‌తో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత 'బార్ బార్ దేఖో' సెట్స్‌లో కత్రీన కైఫ్‌తో కథ నడిపించాడు. ఇప్పుడు కియారా అద్వానీని పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం జరుగుతోంది.

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఒక పార్టీలో కలుసుకున్నారట. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య బాండింగ్‌ స్టార్ట్ అయ్యిందని, 'షేర్‌షా' సెట్స్‌లో ఈ బాండింగ్ మరింత ఎక్కువైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట సిద్ధార్థ్, కియార. పెళ్లి గురించి అడిగిన బాలీవుడ్‌ మీడియాకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు సిద్ధార్థ్ మల్హోత్రా. సరైన సమయంలో.. కరెక్ట్ పర్సన్‌తో మ్యారేజ్ జరుగుతుందని చెప్పాడు. దీంతో కియారా అద్వానీ కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారా లేదా.. మరొకరి కోసం వెతుకుతున్నారా అనే ప్రశ్నలు నెటజన్ల నుండి వినిపిస్తున్నాయి. ఇంతకీ సిద్ధార్థ్‌ ఎవరు కరెక్ట్‌ పర్సన్ అనుకుంటున్నాడో చూడాలి. చూద్దాం.. కియారాతో అయినా సిద్ధార్థ్ పెళ్లి వరకు వెళ్తాడో లేదో.
మరింత సమాచారం తెలుసుకోండి: