ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లుగా  మారిన తర్వాత వారికి తిరుగుండేది కాదు. వారికి వరుస విజయాలు వచ్చినా రాకున్నా కూడా అవకాశాలు మాత్రం వచ్చేవి. కానీ నేటి రోజుల్లో పూర్తిగా సినీ పరిణామాలు మారిపోయాయ్. ముఖ్యంగా ఓటీటీ రాకతో సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకున్నాయి అనే చెప్పాలి.  ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనేది ఎక్కువగా ప్రభావం చూపించడం లేదు. చిన్నహీరోలైనా పెద్ద హీరోలైన కథ ఎలా ఉంది ఎలా నటిస్తున్నారు అన్నది ఎక్కువగా చూస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాదు ఇటీవలి కాలంలో సినిమాల కంటే అటు ఓటీటీ లో వెబ్ సిరీస్ లకే ఎక్కువగా ఆదరణ పెరిగిపోతుంది. దీంతో ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాల వెనక పరుగులు పెడుతున్న స్టార్ హీరోలు తమ లోని నటుడిని నిరూపించుకోవడానికి మాత్రం పోటీలో వెబ్ సిరీస్ లో  ఓ వైవిధ్యమైన పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే రోజురోజుకీ స్టార్డం అనే పదానికి చిత్రపరిశ్రమలో విలువ లేకుండా పోతుంది. ఇక ఇటీవల ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి కన్నా. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎన్నో ఏళ్ల నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ఇక ఇటీవలే స్టార్డమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈరోజుల్లో ఇండస్ట్రీలో స్టార్ అనే పదానికి అసలు విలువ లేదు అంటూ చెప్పుకొచ్చింది. స్టార్ డమ్ అనే మాటకు రోజులు చెల్లి పోతున్నాయి అని తెలిపింది. ప్రతి సినిమాకు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఇండస్ట్రీ లో ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న రుద్ర వెబ్ సిరీస్ లో తనను ఎంపిక చేసే ముందు తాను ఆడిషన్స్ లో పాల్గొన్నాను అంటూ తెలిపింది. తాను సీనియర్ నటి అయినప్పటికీ అవేవి పట్టించుకోకుండా ఆడిషన్స్లో పాల్గొన్నానని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం తెలుగులో థాంక్యూ అనే సినిమాలో కూడా నటిస్తుంది రాసి కన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: