సీనియర్ నటుడు శివప్రసాద్ దర్శకత్వం లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుని అడుగు వేశారు. హీరోగా రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేసుకుని కొత్త హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాడు. అలా చివరకి శ్రీ లత అనే అమ్మాయిని ఆయన సినిమాకు ఫైనల్ చేసుకున్నాడు. ఆమె రోజ..మొదట శ్రీ లత పేరును రోజాగా మార్చి "ప్రేమ తపస్సు" అనే చిత్రం ద్వారా ఈమెని ఇండస్ట్రీకి పరిచయం చేశారు శివ ప్రసాద్. అలా వెండి తెరకు పరిచయమయిన రోజా వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అగ్ర హీరోల అందరి సరసన నటించి టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. తమిళ దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుని మెల్లగా సినిమాలు తగ్గించారు. సెలెక్టివ్ గా కీలక పాత్రల్లో మెరుస్తూ ఇండస్ట్రీకి టచ్ లో ఉన్నారు. బుల్లి తెరపై కూడా జబర్దస్త్ షో, రచ్చ బండ వంటి షో లు చేస్తూ బిజీ అయ్యారు.

ఇటు రాజకీయ ప్రవేశం కూడా చేసి సత్తా చాటుతున్నారు రోజా. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినీ గురువు శివ ప్రసాద్  వల్లనే రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం కూడా నటి రోజాకు అందింది. శివ ప్రసాద్ 1999లో సత్యవేడు ఎమ్మెల్యేగా  పోటీ చేసే సమయంలో  రోజా ఎన్నికల ప్రచారానికి పిలిచారు. గురువు పిలవడంతో వెంటనే  ప్రచారం బరిలో దిగారు రోజ. ఆ సమయంలోనే  టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డారు రోజా. అలా నటి రోజా టీడీపీలోకి చేరి పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అనంతరం వైఎస్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి వైఎస్సార్సీపీ పార్టీలో తనదైన పాత్ర పోషిస్తున్నారు రోజా.

ప్రస్తుతం వై సి పి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు. రాజకీయ రంగంలో రోజా అంటే ఒక ఫైర్ బ్రాండ్. సినిమా పరంగా, రాజకీయ పరంగా , కుటుంబ పరంగా అమే ఒక గొప్ప రోల్ మోడల్. సినిమాల్లో సునాయాసంగా స్టార్ హోదాకు చేరుకున్న ఈమె .. రాజకీయ జీవితంలో మాత్రం ఎన్నో అవాంతరాలను, ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు. అయినా అన్నిటినీ అధిగమించి నేడు ఈ స్థాయిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు. అటు ఇంటిని, ఇటు తనకు భవిష్యత్తు ఇచ్చిన సినీ కెరీర్ ని, మరోవైపు రాజకీయాల్లో ప్రజా సేవను ఇలా మూడింటినీ బాలన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న రోజా సెల్వమణి మహిళలకే ఆదర్శప్రాయంగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: