స్టార్ హీరో అయిన నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది.గరుడవేగ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ మూవీతో ఆ సినిమాను మించిన సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజైన ది ఘోస్ట్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని సమాచారం.

ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారని అందరికి తెలుసు.. కాజల్ కొన్నిరోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారని సమాచారం.కాజల్ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలామంది పేర్లను పరిశీలించి చివరకు ఆమెకు బదులుగా అమలాపాల్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది.ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

  అందమైన హిల్ స్టేషన్ లో ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం . ఈ సీన్లలో లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తుంది.అయితే కొన్ని షరతులతో లిప్ లాక్ సీన్ చేయడానికి అమలాపాల్ అంగీకరించారని వార్త వినిపిస్తుంది.. లిప్ లాక్ సీన్స్ లో నటించాలంటే మరింత ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని అమలా పాల్ కోరినట్టు సమాచారం..   అయితే కాజల్ ఈ మూవీలో నటించి ఉంటే రొమాంటిక్ సీన్లలో నటించేవారా? కాదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని సమాచారం.. అమలాపాల్ ఇప్పటికే పలు సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో నటించి విజయాలను అందుకున్నారని ఆమె సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అమలాపాల్ నగ్నంగా నటించి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారని అందరికి తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: