ఇటీవల కాలంలో యంగ్ హీరోలు చాలామంది టాలీవుడ్ లో తమ సత్తా చాటుకొని హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద హీరోలకు సాధ్యం కాని విధంగా వెరైటీ కథలు వినూత్నమైన దర్శకులను ఎంచుకుని వారు తమ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ విధంగా ఇటీవల ఓ టీ టీ లో ఏక్ మినీ కథ అనే సినిమాను విడుదల చేసి మంచి విజయం అందుకున్నాడు హీరో సంతోష్ శోభన్. హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన అవకాశాలు సరైన విజయాలు దక్కకపోవడంతో ఆయన వెనక పడి పోయారు అని చెప్పవచ్చు.

కాగా ఇన్నాళ్లకు ఆయన విజయం సాధించడంతో అందరూ ఈ హీరో వైపు చూడడం మొదలు పెట్టారు. ఇప్పుడు మంచి కథలు పెద్ద దర్శకులు వచ్చి ఆయనతో సినిమాలు చేయబోతున్నారు. తాజాగా మారుతి దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన మంచిరోజులొచ్చాయి సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించగా ఈ చిత్రం తప్పకుండా అందరిలో నవ్వుల పువ్వులు పూయిస్తుందని భావిస్తున్నారు.

అయితే హీరో కి మొదటి నుంచి సపోర్ట్ గా నిలిచాడు ప్రభాస్. ఈ సినిమాకి మాత్రమే కాదు సంతోష్ ప్రతి సినిమాకి కూడా ప్రభాస్ వెన్నుముక నిలిచి ఈ హీరో ఎదగడానికి ముఖ్య కారణం అయ్యాడు. అయితే దానికి కారణం లేకపోలేదు. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా కి సంతోష్ తండ్రి శోభన్ దర్శకుడు కావడం వల్ల ఆ కృతజ్ఞత భావంతోనే సంతోష్ ఇప్పటివరకు హెల్ప్ చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు మంచి రోజులొచ్చాయి సినిమాకి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. దానికి సంతోష్ ఒక కారణం అయితే మరొకటి ఈ చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ తో ఆయనకు ఉన్న అనుబంధం కూడా మరొక కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: