
కాగా బిగ్బాస్ ఇప్పటికే 65 రోజులు పూర్తి చేసుకుని 70 రోజులకు దగ్గరపడుతోంది. ఇలాంటి సమయంలో ఇక బిగ్ బాస్ హౌస్ లో గేమ్ రోజురోజుకీ మరింత డల్ అయి పోతుంది అని చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఇటీవలే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక స్వీట్ తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇది తినడానికి అర్హులు ఎవరు అని పైన ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. ఇలాంటి సమయంలోనే ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ స్వీట్ తినడానికి అర్హులు మేమే అంటూ ఎవరికి వారు చెప్పుకున్నారు. దీంతో ఒక రోజు మొత్తం గడిచిపోయింది.
అయితే ఆ తర్వాత రోజు ఉదయం సమయంలో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సన్నీ బిగ్బాస్ గార్డెన్ ఏరియా లో పెట్టిన స్వీట్లు తినేసాడు. అయితే ఆ స్వీట్ తినకుండా ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పటికీ తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయినా సన్నీ చివరికి ఎవరు లేని సమయంలో ఆ స్వీట్ మొత్తం తీసేసాడు. దీంతో హౌస్ కెప్టెన్ గా ఉన్న అని ఒక్కసారిగా గార్డెన్ ఏరియా లో కి వచ్చి షాక్ అవుతుంది. అయితే ఇక బిగ్ బాస్ ఆదేశం లేకుండానే సన్నీ ఆ స్వీట్ తినడంతో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.