యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసి చేశాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల విడుదల చేయబోతున్నారు. ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల జోరు పెంచేసింది, ఇప్పటికే ఈ చిత్రం నుండి కొన్ని పోస్టర్ లు, టీజర్, ఒక లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా రాధే శ్యామ్ చిత్ర బృందం మరో లిరికల్ సాంగ్ విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు చేసుకొని రెడీగా ఉంది. అయితే ఈ రెండవ లిరికల్ సాంగ్ టీజర్ విడుదల తేదీని తెలియ జేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పోస్టర్ లను విడుదల చేసింది.

 చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరు నిలుచుని ఉన్నారు. అలాగే వన్ హార్ట్, టూ హాట్ బిట్స్ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో టీజర్ సాంగ్  హిందీ వర్షన్ ను రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయబోతున్నట్లు, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల వర్షన్ లకు సంబంధించిన సాంగ్ టీజర్ ను రేపు రాత్రి 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా రాదే శ్యామ్ చిత్ర బృందం తెలియజేసింది. ఇకపోతే ఈ మొత్తం సాంగ్ ను ఎప్పుడు విడుదల చేస్తారో అనేది మాత్రం ఈ పోస్టర్  చిత్ర బృందం తెలియజేయలేదు. ఇప్పటికే విడుదల అయిన ఒక లిరికల్ సాంగ్  జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, రెండవ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అని జనాలు ఈ సాంగ్ పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: