పెద్ద హీరోలు నటించే సినిమాలు చాలా వరకు కూడా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. పెద్ద హీరోలకు అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ తాలూకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. తమ అభిమాన హీరో ఏం చేసినా కూడా అభిమానులకు ఎంతో గొప్ప అనిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే వాళ్లు చేసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే భావనలో వారు ఉంటారు. దాంతో వారు ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ సినిమా స్థాయి నీ పెంచుకుంటూ వెళుతుంటారు.

ఆ విధంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు అఖండ సినిమా విషయంలో అదే చేశారు. ఈ సినిమా ఎంతటి స్థాయిలో ఉందో తెలుసుకోకుండా మొదటి నుంచి ఈ సినిమా సూపర్ హిట్ అనే నమ్మకంను అందరి ప్రేక్షకుల్లో కలిగించారు. దానికి తగ్గట్లుగానే చిత్ర బృందం ప్రమోషన్స్ చేయడంతో అభిమానులు కూడా చెలరేగిపోయారు. అయితే సినిమా విడుదలైన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో అని అభిమానులు అయ్యారు. సినిమా ఒకటైతే వారు చేసేది ఒకటి కావడంతో ఒక్కసారిగా ఎందుకు ఆ రేంజ్ లో హైప్ అయ్యిందో తెలుసుకున్నారు. 

ఇక సినిమా విషయానికి వస్తే బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ విలువల పరంగా పర్వాలేదనిపించినా కూడా కథ కథనం విషయంలో ఇంకాస్త రాజీపడి ఉంటే బాగుండేది అని అంటున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు తమన్ పర్వాలేదనిపించాడు తన సాంగ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా హిట్ కు హెల్ప్ చేశాడు. బోయపాటి శీను కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని ప్రేక్షకులు చెబుతున్న మాట. కథ కూడా చెప్పుకోదగ్గవి లేవని చెబుతున్నారు. లెంత్ కూడా ఎక్కువగా ఉండటం ఈ భావన రావడానికి కారణం అని అంటున్నారు. కొన్ని ముఖ్య పాత్రల ప్రజంటేషన్ బాగానే ఉంది కానీ కొత్తదనం ఏమీ కనిపించలేదు అని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: