తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో బాలయ్య బాబు హవా కొనసాగుతోంది. ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర హంగామా చేస్తూనే ఉన్నారు. బాణాసంచా కాల్చుతూ స్టెప్పులు వేస్తున్నారు. బాలయ్య ఫ్లెక్సీ ఉంచి.. కొబ్బరి కాయలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో స్పెషల్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బొమ్మ దద్దరిల్లిపోతోంది. జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ కేకలు వేస్తూనే ఉన్నారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర తొడకొడుతున్నాడు. తాను విశ్వరూపం చూపెట్టిన అఖండ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. అమెరికా మార్కెట్లోనూ అఖండ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో 7లక్షల డాలర్ల మార్క్ దాటేసి.. 1మిలియన్ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే 60కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. దాదాపు అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అఖండ సినిమా ఫీవర్ నడుస్తోంది. అమెరికా ఫ్లోరిడాలోని ఓ థియేటర్ లో మూవీ చూస్తూ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. అఖండ సినిమాలో రెండు వేరియేషన్లలో నటించిన బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. బాలయ్యను మరోసారి పవర్ ఫుల్ గా చూపడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. శ్రీకాంత్ నెగిటివ్ షేడ్ లో పవర్ ఫుల్ గా నటించాడు. ప్రగ్యా జైస్వాల్ కి మూవీలో మంచి స్పేస్ దక్కింది. అయితే మూవీ నిడివి కాస్త ఎక్కువైంది. చెప్పుకోదగ్గ ట్విస్టులు ఏమీ లేకపోయినా ఫ్యాన్స్ కు మాత్రం తెగ నచ్చేసింది. యాక్షన్ సీన్స్ కు బాలయ్య అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు.


మొత్తానికి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తున్నారు.





 

మరింత సమాచారం తెలుసుకోండి: