ఆర్ఆర్ఆర్ కి మొదటి నుంచీ అన్నీ టెన్షన్లే. సినిమా షూటింగ్ పై కూడా కరోనా ప్రభావం బాగానే పడింది. అవాంతరాలన్నీ దాటుకుని ఇప్పుడు విడుదలకు ముహూర్తం పెట్టుకుంటే ఇది కూడా సుముహూర్తం అనే గ్యారెంటీ లేదు. అఖండ, పుష్ప.. తాజాగా శ్యామ్ సింగ రాయ్ కి పెద్దగా ఇబ్బందుల్లేవు. థియేటర్లు వందశాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకునే అవకాశముంది. కానీ భవిష్యత్తులో పరిస్థితులు ఇలాగే ఉంటాయనే అంచనాలు లేవు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ పెట్టారు. పండగ వేళ మరిన్ని ఆంక్షలు పెడతారంటున్నారు. సరిగ్గా పండగ కలెక్షన్లపైనే ఆర్ఆర్ఆర్ భారీగా అంచనాలు పెట్టుకుంది. దీంతో అసలేం జరుగుతుందా అనే అనుమానం అందరిలో ఉంది.
అన్నీ బాగుంటే కుమ్ముడే..
పరిస్థితులన్నీ బాగుంటే ఆర్ఆర్ఆర్ వచ్చే టైమ్ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. అటు బాలీవుడ్ సహా ఇతర భాషల్లో కూడా పోటీ ఉండదు కాబట్టి కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షో ల రద్దు వల్ల కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ కోర్టులో తుది తీర్పుపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని లెక్కలు ఆర్ఆర్ఆర్ కి అనుకూలంగా ఉన్నా.. ఒమిక్రాన్ కేసులు పెరిగితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. మిగతా సినిమాల సంగతి పక్కనపెడితే.. విడుదలకి అన్నీ సిద్దం చేసుకుని, ప్రమోషన్ ని కూడా భారీ ఎత్తున ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి మాత్రం ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. దీన్ని రాజమౌళి ఎలా అధిగమిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి