మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు, ఈ ఫామ్ ను ఇలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో రవితేజ వరుస  క్రేజీ సినిమాలో నటిస్తున్నాడు అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో రవితేజ సరసన, డింపుల్ హయాతి మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

సినిమా తో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి 14 వ తేదీ నుండి ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉందట. ఆ పాత్ర ఈ సినిమాకే హైలెట్ గా ఉంటుందట. ఆ పాత్ర కోసం హాట్ లేడీ దక్షా నాగర్కర్ ని చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జాంబి రెడ్డి సినిమాలో దక్ష నటించింది. ఈ సినిమాతో పాటు రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాల్లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: