డైరెక్టర్ బి.గోపాల్ బాలకృష్ణతో కలిసి ఎన్నో సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ గా పేరు పొందాడు. బాలకృష్ణకు ఫ్యాక్షన్ సినిమాలను పరిచయం చేసింది ఈయనే నట. ఇక ఆ తర్వాత చిరంజీవితో కలిసి ఇంద్ర సినిమాని తెరకెక్కించి ఎంతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2002వ సంవత్సరంలో విడుదలైన ఇంద్ర సినిమా ఒక ప్రత్యేకంగా నిలిచిందని తెలియజేశారు. ఆ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని బి.గోపాల్ తెలియజేయడం జరిగింది. ఇంద్ర మూవీ లో ప్రతి సన్నివేశాన్ని నన్ను బాగా కదిలించాయి.. అందుచేతనే నా కెరీర్లో నాకు బాగా గుర్తుండిపోయే సినిమా ఇదే అంటూ తెలియజేశారు.


చిరంజీవి నటన అద్భుతంగా ఉంది.. ఇందులోని పాటలు చాలా డిఫరెంట్గా అనిపించాయి, అందుకు తగ్గట్టుగానే చిరంజీవి డ్యాన్స్ చేశారు అని తెలియజేశాడు. ఇక డైలాగులు పరంగా చిరంజీవికి సరికొత్త ధనాన్ని పరిచయం చేశానని డైరెక్టర్ బి.గోపాల్ తెలియజేశారు. అయితే ఈ సినిమా గురించి ఒక విషయాన్ని తెలియజేశాడు ఈయన.. అదేమిటంటే సాధారణంగా సినిమా టికెట్ లో బ్లాక్ ధర-500,600 రూపాయలు మాత్రమే ఉండేదట. కాని ఒక వ్యక్తి ఈ సినిమాని మొదటిరోజు చూడడానికి 5 టికెట్ల కోసం.. 10 వేల రూపాయలు పెట్టి తీసుకున్నట్లుగా తెలియజేశాడు. అది చిరంజీవి స్టామినా అంటూ తెలియజేశాడు ఈయన.


ఆ తరువాత బి గోపాల్ అవుట్ డోర్ షూటింగ్ కోసం.. బయటికి వెళ్లినప్పుడు.. ఒక లేడి ఎస్పీ గారు వీరందరిని భోజనానికి పిలిచిందట..ఆ సమయంలోనే ఆమె ఏం చెప్పిందో తెలియజేశారు..సాధారణంగా ఏ సినిమా విడుదలైన అక్కడ జనాల రద్దీ ఉండకుండా పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉంటారు..అయితే ఇంద్ర సినిమాకు మాత్రం నేను కూడా వెళ్లాల్సి వచ్చిందని ఎస్పీ మహిళా తెలియజేసిందని బి.గోపాల్ తెలియజేశారు. ఇక చిరంజీవితం ఉన్న అనుభూతి మరిచిపోలేనిది అని చెప్పుకొచ్చారు బి.గోపాల్. ప్రస్తుతం చిరంజీవి యాక్టింగ్ చేసిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: