పుష్ప సినిమాతో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఆయనకు తెలుగునాట ఇప్పటికే స్టార్ దర్శకుడు అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని భాషలలో భారీ క్రేజ్ తెచ్చుకునే విధంగా ఆయన ప్రణాళికలు రచించగా దానికి తగ్గట్టుగానే సుకుమార్ కు భారీ ఇప్పుడు డిమాండ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో వచ్చింది. ఐదు భాషల్లో పుష్ప సినిమా విడుదల చేయగా అన్ని భాషలలోనూ ఈ చిత్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ముఖ్యంగా సౌత్ దర్శకుల టేకింగ్ ను అభిమానించే బాలీవుడ్ సినీ జనాలు ఆయన డైరెక్షన్ కి ఫిదా అయిపోయారు.

తొందరగా హిందీ లో ఓ సినిమా చేయాలని కూడా వారు ఆకాంక్షించారు. మరి వరుసగా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో సుకుమార్ ఎప్పుడు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తారో తెలియదు కానీ బాలీవుడ్ హీరోలలో ఆయనతో సినిమా చేయాలనే కోరిక రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఆయన తో సినిమాలు చేయాలని కోరుకునే హీరోల జాబితాలో చేరాడు బాలీవుడ్  అగ్ర హీరోగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్.  తన సోషల్ మీడియా వేదిక గా తన తో సినిమా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశాడు అక్షయ్.

పుష్ప రెండవ భాగాన్ని ఈ సంవత్సరం విడుదల చేసిన తర్వాత విజయ్ దేవరకొండ తో ఆయన తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇటీవలే విజయ్ దేవరకొండ తో దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఈ సినిమా తప్పకుండా ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ చిత్రం తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మరి బాలీవుడ్ సినిమా ఆయన ఈ రెండు చిత్రాల తర్వాత చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: