ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విడాకుల తరువాత సమంత టైం బాగున్నట్లే అనిపిస్తుంది. మొదట్లో అంటే ఆమె విడాకులు ప్రకటించిన కొత్తల్లో అందరు సమంత చేసింది తప్పు అని..అంత పెద్ద హీరో కొడుకుకి డైవర్స్ ఇస్తుంది..ఇక సినీ ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రానివ్వరు అని..తొక్కేస్తారు అని ..సమంత సినీ చాప్టర్ క్లోజ్ అని అన్నారు. కానీ సీన్ కట్ చేస్తే..విడాకుల తరువాత నే సమంత సినీ కెరీర్ గ్రాఫ్ డే బై డే పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అమ్మడు చేతిలో ఏకంగా 6 బడా ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఇవన్నీ అధికారికంగా ప్రకటించిన సినిమాలే..ఇంకా తెర వెనుక  ఎన్నో సినిమాలు ఫైనలైజ్  అవుతున్నాయి. బడా బడా డైరెక్టర్స్ అమ్మడుకి మంచి మంచి  ఆఫర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే  సమంత మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మహేష్ బాబుకి కరోనా రావడం..ఆయన చేస్తున్న సర్కారువారి పాట సినిమా షూటింగ్ లేట్ అవ్వటం..దీంతో ఆ సినిమా కోసమే మహేష్  కాల్ షీట్లు  అడ్జెస్ట్ చేస్తూ వస్తున్నాడట. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ సినిమా చాలా లేట్ అయ్యేట్లట్లు కనిపిస్తుంది.

ఈ టైం గ్యాప్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇక దాని కోసం ఓ నవల హక్కులను కూడా దక్కించుకున్నాడట మాటల మాంత్రికుడు. ఆ స్టోరీ ప్రకారం అలాంటి క్యారెక్టర్ కు సమంత అయితే పర్ఫెక్ట్ అని..ఒక్కవేళ్ల ఆమె ఈ కధ విని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆమెతోనే ఈ సినిమా తెరకెక్కిస్తా అంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక సమంత త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన స్టోరీకి  ఊ.. కొడితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీగా ఉన్నారట. మరి చూడాలి సమంత ఊ అంటుందా..ఊ ఊ అంటుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: