ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఒక్క చిత్రం తోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్ల గొట్టిన ఈ ఢిల్లీ భామ ఇపుడు తెలుగులోను అవకాశాలను బాగానే అందుకుంటోంది. ఇటు సోషల్ మీడియాలోను అందాల ఆరబోతతో అభిమానులను పిచ్చెక్కిస్తున్న ఈ అందాల తార ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిచ్చి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. సౌరభ్ డింగ్రా…అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని భవిష్యత్తులో పెళ్ళిచేసుకుంటాను అని రివీల్ చేసినప్పటి నుండి సౌరభ్ కూడా సెలబ్రిటీ గా మారిపోయారు.

అప్పటి నుండి అసలు ఈ సౌరభ్ ఎవరు? అతడి బ్యాగ్రౌండ్ ఏమిటి? అన్న వివరాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే పాయల్ గురించి ఇపుడు కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

సరికొత్త బోల్డ్ ఫోటో షూట్ లతో ట్రీట్ ఇచ్చే పాయల్ ఆ మధ్య ఎల్లో డ్రెస్ లో బోల్డ్ ఫోటో షూట్ కి సంబందించిన వీడియోని పోస్ట్ చేసి దారుణంగా ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె వీడియోను డిలీట్ చేశారు. కానీ అప్పటికే డౌన్ లోడ్ వంటివి జరగాల్సిందంతా జరిగింది.  పాయల్ రాజ్ పుత్ సినీ కెరియర్ లో వరుస చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడికి ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చినంత బిగ్గెస్ట్ హిట్ మరొకటి ఇప్పటి వరకు రాలేదు. అయినా ఈ అమ్మడికి క్రేజ్ కి తగ్గట్లు భారీగానే పారితోషికం పుచ్చుకుంటారని టాక్. ఒక్కో సినిమాకి పాయల్ కోటి యాభై లక్షల వరకు తీసుకుంటారు అని సమాచారం.

ఈమె బాలీవుడ్ లోనూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వెండి తెరకు సూట్ అయ్యే అందం, అభినయం పుష్కలంగా ఉన్న పాయల్ కు ప్రస్తుతం సౌత్ నుండి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: