చిత్ర పరిశ్రమ అనేది ఒక్క రంగుల ప్రపంచం. ఈ మాయలోకంలోకి ఎంతో మంది నటులు వస్తుంటారు. అలా వచ్చిన వారిలో స్టార్ పొజిషన్ వెళ్తే.. మరికొంత మంది పెట్టాబేడా సర్దుకొని ఇండస్ట్రీకి దూరమవుతారు. మరికొంత మంది అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైనా నటులలో హీరోయిన్ అంకిత ఒకరు.

ఇక అంకిత వ్యక్తిగత విషయంలోకి వెళ్తే.. ఆమె ముంబైలో జన్మించింది. ఇక మూడేళ్ల వయసులో రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఆమె మరికొన్ని యాడ్స్‌లో నటించింది. అయితే అంకిత వెండితెరకు వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో తొలిసారి హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసింది. మొదటి సినిమా మంచిన విజయాన్ని సాధించడంతో.. ఆమెకు తెలుగులో వెంట వెంటనే అనేక సినిమా అవకాశాలను అందుకుంది.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అంకితకు రెండో మూవీ. ఈ సినిమా 9 జూలై 2003లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీగా కాసుల వర్షం కురిపించింది. సింహాద్రి సినిమా తరువాత స్టేట్ రౌడీ, విజయేంద్రవర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు చిత్రాలలో నటించింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించింది.

 అయితే అంకిత కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా కెరీర్ క్రమంగా డౌన్ అయి అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక చివరికి ఆమె పుణేకు చెందిన బిజినెస్ మాన్‌ విశాల్ జగ్తాప్‌ను పెళ్లి చేసుకుని వైవాహిత జీవితం సంతోషంగా గడుపుతుంది. ఈ దంపతులకు ఇప్పుడు బాబు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం అంకిత ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు తన తండ్రికి ఉన్న డైమండ్స్ వ్యాపారాన్ని చూసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: