నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన చేసిన మూడవ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్ కు ఎదురు లేకుండా పోయిందని అందరూ భావిస్తున్నారు. మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టాడు. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీ చంద్ మలినేని బాలకృష్ణ తదుపరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. 

ఇటీవల ఈ చిత్రం విజయంతో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలు కాగా రెగ్యులర్ షూటింగ్ కు మాత్రం వెళ్లలేదు. బాలకృష్ణ తన ఆహా లో షో పూర్తి చేశాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనాలని భావించగా ఇప్పుడు దీని యొక్క మొదటి సీజన్ పూర్తికావడంతో గోపీచంద్ సినిమా లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాడు. ఇకపోతే బాలకృష్ణపై భారీ బడ్జెట్ పెట్టబోతున్నారని తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్. వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తు ఉండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తప్పకుండా తమకు ఈ సినిమా మంచి పేరు తీసుకు వస్తుందని భావించి ఇంతటి స్థాయిలో బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. 

పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ ను సాధిస్తూ మంచి కలెక్షన్లను సంపాదించుకున్న వీరు ఇప్పుడు వరుసగా పెద్ద హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి భారీ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే వారు నిర్మించిన పుష్ప చిత్రం స్థాయిలో ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే . ఆ చిత్రం విడుదలై నెలరోజులు దాటుతున్న కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించడం నిజంగా వీరి కష్టానికి ప్రతిఫలం వచ్చిందనే చెప్పాలి. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి ఎంతో మంది హీరోలు పోటీ పడుతున్న నేపథ్యంలో బాలకృష్ణ కు ఈ అవకాశం రావడం నిజంగా అదృష్టం అని భావించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: