
ఒకటి రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా టాలీవుడ్ రైటర్ కం ప్రొడ్యూసర్ కోనా వెంకట్ తో ప్రియాంకా సింగ్ లేటెస్ట్ మీటింగ్ టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. కోనా వెంకట్ ని కలిసిన ప్రియాంకా సింగ్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎక్సైటెడ్ వన్ తో వస్తున్నాను అంటూ కామెంట్ పెట్టింది. ఈ లెక్కన ప్రియాంకా సింగ్ తో కోనా వెంకట్ ఓ ప్రయోగాన్ని చేస్తున్నారని అర్ధమవుతుంది. ప్రియాంక సింగ్ కి అలాంటి ఓ ఛాన్స్ వస్తే మాత్రం ఇక అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు.
బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకుంటున్న ప్రియాంకా సింగ్ ఇక మీదట రెచ్చిపోవడం పక్కా అని తెలుస్తుంది. కోనా వెంకట్ తో చేసేది సినిమానా లేక వెబ్ సీరీస్ కోసమే వాళ్లు కలిశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కోనా వెంకట్ చేతిలో పడుతుంది అంటే ప్రియాంకా సింగ్ ఫేట్ మారినట్టే అని చెప్పుకుంటున్నారు సినీ వర్గాల వారు. మరి ప్రియాంకా సింగ్ అంత ఎక్సయిటెడ్ గా ఫీల్ అయ్యేలా ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తుందో చూడాలి.