మొన్నటి వరకు అందరినీ భయపెట్టి ఇక మధ్యలో కాస్త తగ్గినట్టు కనిపించినా కరోనా వైరస్ కేసులు ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా పెరిగి పోతూ ఉండటం అందరినీ భయాందోళనలో ముంచెత్తుతోంది.. అయితే ఎంతో మంది వ్యాక్సిన్ వేసుకుని కరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలా వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం వరుసగా కరోనా వైరస్ బారిన పడుతుండటం గమనార్హం. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా వైరస్ ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి వరసగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతూ ఉండటం అభిమానులందరినీ ఆందోళనలో ముంచెత్తుతోంది.



 ఇలా రోజురోజుకు టాలీవుడ్ లో  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం వరసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఉదయం సమయంలో మెగాస్టార్ చిరంజీవి రెండవసారి కరోనా వైరస్ బారిన పడ్డాను అంటూ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనను కలిసిన వారు అందరూ కూడా తప్పనిసరిగా కరోనా వైరస్ పరీక్షలు చేసుకోవాలి అంటూ సూచించాడు. ఇంతలోనే మరో హీరో ఈ లిస్టులో చేరిపోయాడు.


 ఒకప్పుడు హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని ఇటీవలే అఖండ సినిమాతో విలన్గా అవతారమెత్తిన శ్రీకాంత్ కరోనా వైరస్ బారిన పడ్డాను అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.. ప్రియమైన స్నేహితులారా అవసరమైన  జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను వైరస్ బారిన పడ్డాను. నాకు కొన్ని లక్షణాలు కనిపించాయి అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు హీరో శ్రీకాంత్. గత కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన వారు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అంటూ అభ్యర్థించారు. ఇక శ్రీకాంత్ త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులందరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: