మాస్ మహారాజా రవితేజ `క్రాక్` బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాగా స్పీడు పెంచేశాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టేశారు.మాస్ మహారాజా రవి తేజ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాల వరకు వున్నాయి.ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా వున్న మన మాస్ రాజా రవితేజకి కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్ లోకి ఏదైనా కొత్త మోడల్ కార్ వచ్చేసిందంటే చాలు ఇక తన ల్యాన్ లో దిగిపోవాల్సిందే. ఇంతకీ మన మాస్ రాజా రవి తేజ దగ్గర వున్న కాస్ట్లీ కార్లేంటో ఒక సారి చూద్దాం. రేంజ్ రోవర్ ఎవక్యూ దీని రేటు వచ్చేసి 63.82 లక్షలు. 9 కలర్ లలో అందుబాటులో వుండే ఈ కార్ 7 మోడల్ ని మాస్ మహారాజా సొంతం చేసుకున్నారు. దీని తరువాత రవి తేజకు బీఎండబ్ల్యూ ఎం 6 మోడల్ కార్ కూడా వుంది. దీని రేటు వచ్చేసి 1.24 క్రోర్స్. ఇక మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కూడా మాస్ మహా రాజా రవితేజ వాడారు. దీని రేటు 2.43 క్రోర్స్.ఈ కార్ల కలెక్షన్ చూసిన వాళ్ల మైండ్ అంతా దెబ్బకి బ్లాకవుతోంది.

మాస్ రాజా రవి తేజ ఈ రేంజ్ కార్ లని మెయింటైన్ చేస్తున్నాడా? అని అందరూ కూడా తెగ అవాక్కవుతున్నారు. ఇక ఇదిలా వుంటే వచ్చే నెలలో మాస్ మహా రాజా రవితేజ `ఖిలాడీ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హిందీలోనూ అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాకి కోనేరు సత్యనారాయణతో పాటు నార్త్ ఇండియా ఫిల్మ్ మేకర్ పెన్ స్టూడియోస్ అధినేత అయినా డా. జయంతిలాల్ గడ సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఆయనే `ఖిలాడీ`సినిమాని ఉత్తరాదిలో హిందీ వెర్షన్ లో భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీతో మాస్ మహారాజా రవితేజ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుండటం గమనార్హం.మరి చూడాలి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్టుని అందుకుంటాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: