రిపబ్లిక్ డే జెండా వందనం నాడు ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆరోజు అందరిలాగానే జెండావందనం చేసిన మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వీయనిర్భంధంలో ఉన్నానని ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో సోషల్ మీడియాల్లో సాటి సెలబ్రిటీల నుంచి ప్రార్థనలు వెల్లువెత్తాయి.మెగాస్టార్ చిరంజీవి గారు తొందరగా కోలుకోవాలని సినీపరిశ్రమ ప్రముఖులు అంతా కూడా ఆకాంక్షించారు.అందరితో పాటు బన్ని కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. అల్లు అర్జున్ కూడా చిరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ``మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాను. లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిసి నేను సంతోషిస్తున్నాను. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను`` అని కామెంట్ చేశాడు. అతని ఈ సింపుల్ సమాధానం ఇప్పుడు చాలా మంది అభిమానులకు సాధారణ జనులకు అంతగా నచ్చడం లేదు. బన్నీ పోస్ట్ లో ఎక్కడా `గారు` అన్న ప్రస్థావన లేదు. కనీసం మావయ్య అని కూడా పిలవలేదు. ఇది మెగా ఫ్యాన్స్ కి అస్సలు ఏమాత్రం రుచించలేదు.

అందుకే దీనిపై ట్రోలింగ్ సాగుతోంది.కొందరైతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకే ఈ హెడ్ వెయిట్ అంటూ కూడా బన్నీ ని విమర్శించేస్తున్నారు. చంద్ర బాబు- లోకేష్ ఇంకా ఎన్టీఆర్ లాంటి ప్రముఖులే చిరంజీవిని సార్ అని పిలిచారు. కానీ బన్ని అలా పిలవలేదని మెగా ఫ్యాన్స్ ఫైరయ్యారు. సినీప్రముఖులంతా కూడా పోస్ట్ లో గారు అని ప్రస్థావించారు. అంతేకాదు ఒక ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవికి గౌరవం ఇవ్వాలని బన్నీ డిమాండ్ చేసిన పాత వీడియో కూడా ఒకటి వైరల్ గా మారింది. బన్నీ స్వయంగా సార్ లేదా గారు అంటూ గౌరవించాలని ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఆయన దానిని ఎందుకు మరచిపోయాడనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతోందన్న టాక్ అనేది బాగా స్ప్రెడ్ అవుతోంది. తాజా పోస్ట్ లో గారు అని పిలవకపోవడం అనేది ఇప్పుడు మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: