టాలీవుడ్ కపుల్స్ లో నాగచైతన్య, సమంత కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట గత ఏడాది అక్టోబర్ నెలలో విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ అయ్యారు. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే విషయం పై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వీరు విడాకులకు కారణాలు సంబంధించి అనేక వాదనలు వినిపించాయి.  సమంత నటించేందుకు అక్కినేని కుటుంబం ఒప్పుకోలేదని.. మరికొందరు సమంత పెళ్లి తర్వాత కూడా ఎవరితో రొమాన్స్ చేయడం చైతూకి నచ్చకపోవడంతో విడిపోయారని ఇలా రకరకాలుగా వార్తలు హల్ చల్ చేశాయి.

అయితే వీటి గురించి ఎవరికీ సరైన స్పష్టత లేదు. కానీ ఈ విషయంపై తాజాగా నాగార్జున తొలిసారి స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున చైతు, సమంత విడిపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఈ మేరకు నాగ్ మాట్లాడుతూ..' నాగచైతన్య సమంత నిర్ణయాన్ని అంగీకరించాడు. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చాడు. కానీ కుటుంబ పరువు ఏమైపోతుంది అనే విషయాన్ని చైతు చాలా ఆలోచించాడు. ఈ విషయంలో అనేక సార్లు ఆందోళన చెందాడు అని నాగార్జున చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సమంతతో విడాకుల తర్వాత నన్ను చైతన్యం చాలా ఓదార్చాడు. నాలుగేళ్లపాటు వారిద్దరూ వివాహ బంధం లో కొనసాగారు.

అయితే అంతకుముందు వారిద్దరి మధ్య ఈ సమస్య రాలేదు. గత ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా ఇద్దరు కలిసి జరుపుకున్నారు. కానీ ఆ తర్వాత వారి మధ్య ఏదో సమస్య తలెత్తి ఉంటుంది అని స్పష్టం చేశారు. అంతే కాకుండా అదే ఇంటర్వ్యూలో అడిగిన మరో ప్రశ్నకు కూడా నాగ్ ఆసక్తిగల సమాధానమిచ్చారు. నాగ చైతన్య పక్కన ఆన్ స్క్రీన్ హీరోయిన్ గా మీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు అనే ప్రశ్నకు వెంటనే సమంత అని నాగార్జున జవాబిచ్చారు. దీంతో ప్రస్తుతం చైతు, సమంతల విడాకుల విషయం పై నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: