ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న  లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ఇంతకు ముందు పూరి జగన్నాథ్ స్మార్ట్ శంకర్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా ప్రారంభించాడు.  అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు కోవిడ్ కారణంగా ఆగి పోవడం జరిగింది. మరి కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తర్వాత పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమా విజయ్ దేవరకొండతో తీయనున్నట్లు సమాచారం.  అయితే పూరి జగన్నాథ్ సినిమా ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టనుందట. అయితే ముందుగా ఈ ప్రాజెక్టు మహేష్ బాబు కోసం సిద్ధం చేశారట పూరి జగన్నాథ్... కానీ మహేష్ బాబు కి కుదరకపోవడంతో ఈ సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఇక  లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ బాలకృష్ణతో కలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అన్న రూమర్స్ కూడా  వినిపిస్తున్నాయి. అయితే లైగర్ సినిమాను పూరి జగన్నాథ్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్,గ్లిమ్ప్స్ అభిమానులలో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.అయితే ఈ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.  ఇక ఈ సినిమాతో ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ మరియు చార్మి ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు.అయితే బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు సినిమా వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: