ఇక ప్రస్తుతం తమిళ రాజకీయాలను పరిశీలిస్తే కనుక బలమైన విపక్షం ఏదీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అన్నాడీఎంకే పూర్తిగా బలహీనమైపోవడం జరిగింది.ఇక ఆ పార్టీని సరైన దిశలో నడిపించే నాయకులు కూడా ఎవ్వరూ లేరు. కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలు తమిళనాడులో ఎప్పుడూ కూడా తోక పార్టీలే ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అంటకాగడమే తప్ప...అవి అసలు స్వతంత్రంగా బరిలోకి దిగే పరిస్థితి అయితే లేదు. అంతటి జనాదరణ లేదనే చెప్పాలి. ఇక నిజం చెప్పాంలటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎంకే నేత స్టాలిన్ ను ఢీ కొట్టే మొనగాడు అంతటి జనాకర్షణ ఉన్న నేత తమిళ రాజకీయాల్లో అయితే ఇప్పుడు కనిపించడం లేదనే చెప్పాలి.

సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న హీరో విజయ్. ఇక రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రజలు ఎంతగానో ఎదురుచూశారు. కానీ ఆయన రాకుండా వెనకడుగు వేశారు. పార్టీ అంటూ హడావుడి చేసినా కానీ రాజకీయ కదనరంలోకి దూకే సాహసం ఆయన చేయలేకపోయారు. ఇక మీదట కూడా రాజకీయాల్లోకి వచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా కానీ ప్రజలు ఆయన్ని ఆదరించలేదు. తమిళనాట ఏ ఎన్నికల్లోనూ కమల్ హాసన్ అంతగా ప్రభావం చూపలేకపోయారు.ఈ రాజకీయ సూన్యమే విజయ్ కి కలిసొస్తుందన్న అక్కడ  ఇక విశ్లేషణలు వెలువుడుతున్నాయి. దీనికి తోడు కొన్ని నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు శాంపిల్ అన్నట్టుగా బరిలోకి దిగడం జరిగింది. 

ఇక 125 స్థానాల్లో పోటీ పడితే  వారు ఏకంగా 115 చోట్ల విజయం సాధించారు. ఇది కూడా విజయ్ కు మంచి సానుకూల సంకేతమే.ఇక డీఎంకే పరంగా చూస్తే స్టాలిల్ తర్వాత ఆ పార్టీలో జనాకర్షక నేత అసలు ఎవ్వరూ లేరు. ఆయనకు కూడా వయస్సు 65 సంవత్సరాలు దాటింది. ఇక ఆయన తన వారసుడిని తీర్చిదిద్దేపనిలో పడతారు. అయితే అందుకు కొంత టైం అనేది పడుతుంది.ఇక దీనికితోడు తమిళ రాజకీయాల్లో ఒక పార్టీ వరుసగా రెండోసార్లు గెలవడం అనేది అసలు చాలా అరుదు. వచ్చే ఎన్నికల నాటికి విజయ్ బలమైన పునాది కనుక వేసుకోగలితే ఆయనకు అసలు తిరుగుడందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: