విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రం గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా విడుదల కాబోతు ఉండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా యొక్క టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవరకొండ అభిమానులను ఈ టీజర్ బాగా అలరించింది అని చెప్పవచ్చు. టీజర్ కి సినిమా విడుదల అన్నట్లుగా సంబరాలు చేశారు. ఆ విధంగా ఈ సినిమాపై వారిలో ఎంతగా అంచనాలు ఉన్నాయో తెలియజేశారు. ఈ సినిమా మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ తో మరొక సినిమా కూడా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాధ్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ ను ఈ హీరో తో చేస్తూ ఉండడం విశేషం. 

జనగణమన అనే సినిమాతో త్వరలోనే వీరి కాంబో మరొకసారి షూటింగ్ మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టే విధంగా చిత్రబృందం ప్రణాళికలు వేస్తుంది. ఈ సినిమాలో కూడా భారీ స్థాయి నటీనటులే కనిపించబోతున్నారని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయి నటీనటులను కూడా తీసుకోపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకంటే ముందే శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమ కథ సినిమా లో చేసే విధంగా విజయ్ ప్లాన్ చేశాడు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఇ ప్పటినుంచి ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: