నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో  అఖండ గర్జన మోగించి... ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్‌లో 107వ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇకపోతే మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.కాగా  ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే  కన్నడ హీరో దునియా విజయ్ బాలయ్యను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ ముసళ్ల మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కనిపిస్తున్నాడు. 

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భయంకరంగా ఉండడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇకపోతే ఈ సినిమాను కంటిన్యూగా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే దసరాకే బాలయ్య సినిమా అంటే అఖండ వచ్చిన యేడాదిలోపే మరో సినిమాతో ఆయన అభిమానులకు మాంచి విందు ఇవ్వనున్నాడన్న మాట.  క బాలయ్య స్టైల్లో ఫుల్ మాస్ జాతర కావడంతో మరోసారి థియేటర్లు మాస్ మానియాతో ఊగిపోనున్నాయి. ఈ సినిమాకు థమన్ స్వరాలు  అందించారు.అయితే ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - బాలయ్య కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను జూన్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

 ఇకపోతే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా కోసమే అనిల్ రావిపూడి వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ సినిమాలో మరో హీరో పాత్ర ఉంటుందని.. కాగా అది రవితేజ పాత్రే అని కూడా ప్రచారం జరుగుతోంది.అయితే ఫస్టాఫ్ అంతా చాలా సీరియస్‌గా సాగుతుందని.. అంతే కాదు సెకండాఫ్‌లో రవితేజ పాత్ర ఉంటుందని.. ఇక సెకండాఫ్‌లో కామెడీతో పాటు యాక్షన్‌కు స్కోప్ ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటె తాజాగా బాలయ్య - అనిల్ కాంబినేషన్లో గతంలోనే రామారావు గారు టైటిల్‌తో ఓ సినిమా రావాల్సి ఉంది. ఇక  ఆ తర్వాత మరో కథను అనిల్ వినిపించగా బాలయ్య ఓకే చెప్పాడు.అయితే ఆ కథతోనే ఇప్పుడు ఈ సినిమా పట్టాలు ఎక్కుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: