టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత విడాకులు ప్రకటన తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటూ అస్సలు గ్యాప్ లేకుండా చూసుకుంటోంది.

అయితే హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉండగా ఎప్పుడు కాస్త గాప్ దొరికినా ఆమె ముంబై వెళ్లి పోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. నిజానికి నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్ర లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.


రీసెంట్‌ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా సెట్‌లో సమంత సందడి మాములుగా లేదు. పార్టీ అయిన వెంటనే చెన్నై నుంచి ఆమె ముంబై వెళ్ళిపోయిందట.. అయితే ఆమె హైదరాబాద్ కంటే ఎక్కువగా ముంబైలో ఉండడానికి గల కారణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని తెలుస్తుంది... ముంబైలో బీచ్ వ్యూ ఉన్న ఒక ప్రాపర్టీ కొనడానికి సమంత సిద్ధంగా ఉందని సమాచారం.ఇప్పటికే ప్రాపర్టీ డీలర్ లు ఆమెకు చాలా ఇళ్ళు కూడా చూపించారు కానీ ఆమెకు నచ్చిన వ్యూ ఉన్న ఇంటిని మాత్రం చూపించలేకపోయారు అని తెలుస్తోంది.

సమంత ఇప్పటికే వరుణ్ ధావన్‌తో కలిసి వెబ్ సిరీస్ ప్లాన్ చేయగా,ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన కథానాయికగా ఛాన్స్ దక్కించుకుందనే ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి సమంత ఇటు టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం.

ఫ్యామిలీ మాన్ సిరీస్ చేసిన తర్వాత సమంత ఇమేజ్ బాగా పెరిగింది. దానికి తోడు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఆమెకు భారీ గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ గుర్తింపుని ఇప్పుడే వాడుకుంటే సరిపోతుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా మొదలు పెట్టాలంటే కష్టమని భావిస్తున్న ఆమె పలు బాలీవుడ్ ప్రాజెక్టులలో భాగమయ్యేందుకు కూడా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: