అదేమిటంటే ఫహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రలో నటించిన.. తోందిముతలం ద్రిక్షక్షియమ్ అనే చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. చిత్రం 2017లో మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఎంతో రాబట్టడమే కాకుండా అవార్డుల సైతం సాధించింది. ఇక మలయాళంలో ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఆ హాలు ఈ చిత్రం దొంగాట అనే పేరుతో విడుదల చేస్తున్నారు. మే 6 వ తేదీన ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
దీంతో మలయాళ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన హీరో ఫాహద్ ఫాజిల్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పుష్ప చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పుష్ప సినిమా లో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. అయితే రాబోతున్న పుష్ప సీక్వెల్ సినిమాలో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఇదివరకే తెలియజేయడం జరిగింది. మరి ఈ చిత్రంతో మరింత దగ్గరవుతారు ఏమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి