కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. 'జై భీమ్' సినిమాతో దేశాన్ని కదిలించిన ఆయన ఆ సినిమాతో ప్రశంసలే కాదు.. ఓ వర్గం నుంచి అనేక విమర్శలు కూడా అందుకున్నారు.ఓటీటీ వేదికపై రిలీజ్ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గిరిజనులకు అండగా నిలుస్తున్న లాయర్ చంద్రు కథే ఈ 'జైభీమ్'. ఈ సినిమాలో చంద్రు పాత్రలో హీరో సూర్య అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో కేవలం హీరోగానే కాదు నిర్మాత కూడా ఆయనే. మంచి కథా బలం ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ '2డీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం'పై ఆయన నిర్మిస్తున్నారు.టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో 'జైభీమ్' సినిమాని ఆయన రూపొందించారు. పోలీసులు కేసులు కోర్టులు అంటూ సాగే సినిమా ఇదీ. ఇక సామాజిక అసమానతలు ఒకవర్గాన్ని మరో వర్గం తక్కువగా చూడడం అనేది మన దేశంలో అసలు కొత్తేమీ కాదు..బాగా అనాదిగా జరుగుతున్న విషయమే ఇదీ.. కాలక్రమేణ ఇందులో కొంత మార్పు అనేది కూడా కనిపిస్తోంది.



రాజ్యాంగం కల్పించిన హక్కులు అనేవి అందరికీ అందుబాటులోకి రావడం లేదు.ఇదే అంశంతో వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన స్టోరీ 'జైభీమ్'. సినిమా విమర్శలకు ప్రశంసలు బాగా అందుకుంది. అయితే ఒక వర్గం నుంచి మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమైంది.హీరో సూర్య దంపతులకు కోర్టు షాక్ ఇవ్వడం జరిగింది. సూర్య ఆయన భార్య జ్యోతికపై తాజాగా కేసు నమోదు చేయాలని సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇది పెద్ద సంచలనమైంది.రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు అయిన సంతోష్ నాయక్ తాజాగా జై భీమ్ సినిమాలో కులాన్ని మతాన్ని కించపరుస్తున్నారని కోర్టును ఆశ్రయించడం జరిగింది. సినీ నిర్మాతలు హీరో సూర్య నటి జ్యోతికపై సంతోష్ నాయక్ సైదాపేట కోర్టులో పిటీషన్ ని దాఖలు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: