ఇటీవల కాలంలో వరుస సినిమాలని  లైన్ లో పెడుతూ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సీనియర్ హీరోల సినిమాలను చేస్తూ యువ హీరోలకు సైతం పోటీ గా నిలుస్తూ ఉన్నారు. తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రాజెక్టు లో నటిస్తున్నాడు చిరంజీవి. Dvv ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు గా ప్రకటించడం జరిగింది. ఛలో, భీష్మ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈయన కూడా మెగాస్టార్ వీరాభిమాని. ఇక తన ఫేవరెట్ హీరో సినిమాని తెరకెక్కించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని పలుసార్లు సోషల్ మీడియాలో తెలియజేశారు.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అసలు ఉందో లేదో అన్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. మిగతా చిత్రాలన్నీ ఏదో ఒక న్యూస్ తో వార్తల్లో నిలుస్తున్న అప్పటికీ వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇక తాజాగా ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు చిరంజీవి. ఇక ఈ సినిమా తో అప్రమత్తంగా మారిపోయారు మెగాస్టార్.

ఇక కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చిరంజీవి తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం వెంకీ ప్రాజెక్టు ను పక్కన పెట్టేసారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు స్టోరీ లకు సంబంధించి చిరంజీవికి చెప్పగా చిరంజీవి నుండి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదట వెంకీ కుడుములకి. అందుచేతనే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోతున్న ట్లుగా పుకార్లు వస్తున్నాయి. మరి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చి ఈ రూమర్లకు చెక్ పెడతారేమో చూడాలి. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే లూసిఫర్ రీమేక్ చిత్రంలో కూడా నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: