తన కెరీర్ ప్రారంభం నుంచి పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ మంచి టాలెంటెడ్ నటిగా సాయి పల్లవి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.


ఒక నటిగా తొలి నుంచి కూడా ఆమె కొన్ని పరిధులను అయితే విధించుకుంది. గ్లామర్ పాత్రలకు మరియు ఎక్స్ పోజింగ్ కు ఆమె దూరంగా ఉంది. ఇప్పటి వరకు ఏ చిత్రంలో కూడా ఆమె స్కిన్ షో అయితే చేయలేదు. మిగతా హీరోయిన్లు చేస్తున్నట్టు గ్లామర్, ఎక్స్ పోజింగ్‌లకు దూరంగా ఉంటూనే వచ్చింది. కేవలం తన నటన ద్వారా మాత్రమే గుర్తింపు పొంది, అదే ఆయుధంగా సినిమాల అవకాశాలను పొందగలుగుతోంది సాయి పల్లవి l. అయితే తాజాగా పొట్టి దుస్తుల్లో వేసుకుని చేసే ఐటం సాంగ్స్ పై స్పందించిందట.. గ్లామర్ షో చేయటంలో తాను కంఫర్ట్ గా ఉండలేనని చెబుతుందట సాయిపల్లవి. ఓ ఇంటర్వ్యూలో సమంత మరియు పూజ హెగ్డేలు చేసే స్పెషల్ సాంగ్స్ పై సాయిపల్లవి మాట్లాడుతూ కుండబద్దలు కొట్టినట్టు వ్యాఖ్యలు చేసిందట..


ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప చిత్రంలోని సమంత ఐటెం సాంగు, రంగస్థలంలోని పూజా హెగ్డే జిగేలు రాణి వంటి పాటలలో నర్తించే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి సాయిపల్లవి తనదైన శైలిలో సమాధానమిచ్చిందట . దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. 'ఐటెం సాంగ్స్‌ నాకు అస్సలు కంఫర్ట్‌గా ఉండవు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాటిలో నటించే అవకాశం వచ్చినా కూడా చేయనని చేప్తాను. ఎందుకంటే వస్త్రధారణ సరిగా లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా అస్సలు ఉండలేను. అందుకే స్పెషల్‌ సాంగ్‌లో అస్సలు నటించలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడాఅస్సలు లేదు' అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక వ్యక్తిగత జీవితంలో ప్రేమపై స్పందిస్తూ.. ప్రేమ ప్రతి మనిషికి అవసరం అని ఆమె తెలిపింది. మనిషికి కెరీర్‌ ఎంత ముఖ్యమో, ప్రేమ కూడా అంతే అవసరం అని, ఈ రెండింటిలో ఏది లేకపోయినా లైఫ్‌ ఫుల్‌ ఫిల్‌ కాదని ఆమె స్పష్టం చేసింది. అయితే ఆ మధ్య సాయిపల్లవిలో ప్రేమలో ఉందని, మ్యారేజ్‌ చేసుకోబోతుందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అందులో నిజం లేదని ఆమె కొట్టిపారేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి: