
జోగి బ్రదర్స్ దెబ్బకు సుమకు దిమ్మతిరిగిపోయింది. జోగి బ్రదర్స్ సుమ గురించి, క్యాష్ షో గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. సుమ తెలుసు కదా? అని ఒకడు అంటే.. నాకెందుకు తెలియదు.. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా?.. యాంకరింగ్ చేస్తోందంటూ అనేస్తాడు.దీంతో సుమ తెగ నవ్వేస్తుంటుంది.సుమ పంచ్‌లు అలా ఎలా వేస్తుందంటావ్ రా అని అడిగితే.. రాత్రంతా పడుకోదు.. ప్రాక్టీస్ చేస్తుంది.. పొద్దున్నే వచ్చే పంచ్‌లు వేస్తుంది అని అంటాడు..
వాళ్ళు వేస్తున్న పంచులకు సుమ బాగా నవ్వెస్తుంది.. ఎప్పుడూ అందరూ పంచులు వేస్తుంటారు. కానీ,ఈ షో లో మాత్రం రివర్స్ అయ్యింది.మనం ఏమైనా నేర్చుకుందామా? అన్నయ్య అని అంటే.. మనం నేర్చుకోలేం.. ఎందుకంటే మనకు మళయాలం అర్థం కాదు కదా? అంటాడు. దీంతో మళ్లీ సుమ నవ్వేస్తుంటుంది.సమీర్ రెగ్యులర్ కాంట్రాక్ట్ తీసుకున్నాడట తెలుసా? నఅని అంటే.. కాంట్రాక్ట్ కాదు.. వచ్చినప్పుడల్లా సుమ డబ్బులు ఇవ్వడం లేదట.. ఏదో ఒకనాడు ఇస్తుంది కదా? అని అలా వస్తుంటాడట అని సమీర్ గురించి, సుమ గురించి జోగి బ్రదర్స్ సెటైర్లు వేస్తారు...మొత్తానికి షో మొత్తం హైలెట్ అయ్యింది..ప్రోమో అయితే బాగానే కట్ చేశారు..మరి షో కూడా బాగుంటుందని జనాలు అంటున్నారు.