నందమూరి సింహం బాలకృష్ణ 63 సంవత్సరాల వయస్సులో రోజురోజుకి చిన్నవాడు అయిపోతున్నాడు. ఆహా లో ప్రసారం అయిన ‘అన్ ష్టాపబుల్’ షోతో బాలకృష్ణ మ్యానియా నేటితరం యూత్ కు కూడ సోకడంతో అప్పటి దాకా బాలకృష్ణ పని అయిపోయింది అని కామెంట్స్ చేసినవారికి వారి నోళ్ళు మూసుకునేలా చేసింది.  


ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న బాలకృష్ణ తన లుక్ లో కూడ చాల మార్పులు చేసుకుంటూ చూసేవారని ఆశ్చర్య పరుస్తున్నారు. ఆహా లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇండియన్ ఐడల్’ తెలుగు కార్యక్రమం ఆహా లో స్ట్రీమ్ అవుతున్న కార్యక్రమాలలో టాప్ లిస్టులో కొనసాగుతోంది. ఫైనల్స్ స్టేజ్ కి చేరిన ఈ షోకు స్పెషల్ చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదలచేసారు.


ఈవీడియో షేర్ అయిన కొద్ది గంటలలోనే వైరల్ గా మారింది. ఈ షోలో గాయకులు అంతా బాలకృష్ణ సినిమాలలోని పాటలను పాడారు. తన పాటలు పాడుతున్న సింగర్స్ ను ప్రోత్సహిస్తూ బాలయ్య తాను వ్రాసిన ఒక పుస్తకం టైటిల్ ను బయటపెట్టాడు. ‘భార్యను ఏమార్చడం ఎలా’ అన్న టైటిల్ తో బాలయ్య వ్రాసిన ఈపుష్తకంలో భార్యను ఏవిధంగా మలుచుకోవాలి అనే నీతి సూత్రాలు నేటి యూత్ కు అర్థం అయ్యేలా బాలయ్య చెపుతాడట.


అంతేకాదు పెళ్ళి గురించి తొందర పడకుండా లైఫ్ ను ఎంజాయ్ చేయమని బాలయ్య సందేశం ఇస్తున్నాడు. సీనియర్ హీరో స్థాయిలో ఉన్న బాలయ్య యూత్ తో కలిసిపోతు వేసిన స్టెప్స్ ఈ స్పెషల్ ఎపిసోడ్ కు అదనపు ఆకర్షణ. జూన్ 10న ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ఒకవిధంగా బాలకృష్ణ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకు వస్తుంది. ‘అన్ ష్టాపబుల్ సీజన్ 2’ త్వరలో ప్రారంభం అవుతున్న పరిస్థితులలో ఈసారి బాలకృష్ణ ఏ హీరోలతో ఒక ఆట ఆడుకుంటాడు అన్నవిషయమై రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: