టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రాజా వారు రాణి గారు , ఎస్ ఆర్ కళ్యాణ మండపం , సెబాస్టియన్ మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా సమ్మతమే మూవీ లో  హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . 

మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా ఈ మూవీ కి గోపీనాథ్ దర్శకత్వం వహించాడు . ఈ సినిమా రేపు అనగా జూన్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది . ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా సమ్మతమే చిత్ర బృందం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 

సెన్సార్ బోర్డ్ నుండి సమ్మతమే మూవీ కి యు / ఎ సర్టిఫికెట్ లభించింది . ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . కిరణ్ అబ్బవరం ఆఖరుగా నటించిన సేబాస్టియన్ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. సేబాస్టియన్ మూవీ లో కిరణ్ అబ్బవరం పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు .  మరి సమ్మతమే సినిమాతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి . ఈ మూవీ కి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: