యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా రోజులుగా అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయం కోసం ఎదురు చూస్తున్న కమల్ హసన్ కు విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం దక్కింది .

జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు తెలుగు, హిందీ , మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన విక్రమ్ సినిమా విడుదలైన అన్ని భాషలలో, అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ సినిమా మరో అదిరిపోయే రేర్ మార్క్ కలెక్షన్ లను టచ్ చేసింది. తాజాగా విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ ను టచ్ చేసి అదిరిపోయే రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.O సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్ లను సాధించిన రెండో తమిళ సినిమాగా విక్రమ్ సినిమా నిలిచింది. ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా కేవలం ఓవర్ సీస్ లో లోనే దాదాపు 120 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లను వసూలు చేస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించగా ఫహాద్ ఫాజిల్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. వీరితో పాటు సూర్య అతిథి పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాకు యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: