'నువ్వే కావాలి' చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సాయి కిరణ్‌. 'అనగనగా ఆకాశం ఉంది..' అంటూ ఆ చిత్రంలో సాయి కిరణ్ చేసిన సందడికి తెలుగు ప్రేక్షకులు బాగా ముగ్ధులయ్యారు. ఆ తరవాత పలు చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు నటుడు సాయి కిరణ్. అయితే ఈయన ప్రముఖ గాయని పి.సుశీల గారి మనవడు అన్న విషయం చాలా మందికి తెలియదు. అవును ఇది నిజమే గాయని సుశీలకు సాయి కిరణ్ స్వయానా మనవడు. సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
కాగా ఈ నటుడు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో అంతా అవాక్ అయ్యారు.


ఇంతకీ సాయి కిరణ్ ఎందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అంటే.. నన్ను ఒక నిర్మాత మోసం చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించాడు సాయి కిరణ్. మన్న మినిస్ట్రీస్‌ గ్రూప్‌లో సభ్యత్వం అంటూ నిర్మాత జాన్‌ బాబు, లివింగ్‌ స్టెన్‌ తన నుంచి రూ. 10.6 లక్షలు సొమ్మును తీసుకుని తర్వాత తన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారు అని, ఇవ్వను ఏమి చేస్తావు అంటున్నారు అని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సాయి కిరణ్ ఫిర్యాదు తో నిర్మాత జాన్‌ బాబు, లివింగ్ స్టన్‌లపై సెక్షన్లు 420, 406 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాయి కిరణ్‌ ప్రముఖ నేపథ్య గాయకుడు కూడా... అలాగే హైదరాబాద్‌ బ్లూక్రాస్‌ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అంతే కాకుండా శివుడిపై 'శ్రీవత్సన్‌' అనే ఆల్బమ్‌ను కూడా రూపొందిస్తున్నాడు సాయి కిరణ్‌. ఈ మధ్య కాలంలో 'కోయిలమ్మ', ఇపుడు 'గుప్పెడంత మనసు' సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు సాయి కిరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: