రవితేజ హీరోగా తాజాగా నటించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అలనాటి హీరో వేణు తొట్టెంపూడి నటించడం జరిగింది. ఈయన హీరోగా పలు సినిమాలలో నటించి సక్సెస్ కూడా అందుకున్నారు. కానీ కొన్నాళ్ళు ఈయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. దీంతో ఈ హీరోని ప్రజలు కూడా మర్చిపోయారు అనుకుంటున్న సమయంలో తాజాగా ఈ సినిమాతో వేణు రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.


ఏ హీరోతో నైనా మొదటి సినిమా లేదా రీ ఎంట్రీ సినిమా అంటే ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాలి. ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ సినిమాని నిర్మించాలి. ముఖ్యంగా మొదటి సినిమా విషయంలో ప్రయోగాలు చేయడం అనేది చాలా రిస్క్ అవుతుంది చాలా పెద్ద రిస్క్ అంటే ప్రయోగం చేశారని చెప్పవచ్చు. హీరో వేణు సినిమాలు చూస్తున్న సమయంలో ఆ వాయిస్ తనదే అని అనుకుంటూ ఉంటాం కానీ రామారావు యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలలో వేణు మాట్లాడిన సమయంలో ఆయన మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. వేణు వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారు.

అంటే గతంలో కూడా వేణు నటించిన సినిమాలకు వేరే వారు డబ్బింగ్ చెప్పారని ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థమయింది ప్రజలకు. రామారావు ప్రమోషన్ కార్యక్రమంలో వేణు వాయిస్ ను జనాలు అంతగా పట్టించుకోలేదు. ఇక సినిమాలో అయితే జనాలు ఆ వాయిస్ ని ఎలా స్వీకరిస్తారు అనే విషయాన్ని రామారావు ఆన్ డ్యూటీ సినిమా చిత్ర బృందం ఆలోచించలేకపోయింది. ఈ సినిమాలో వేణు పాత్ర బాగానే ఉన్నది ఎప్పటిలాగానే ఆయన నటన బాగానే ఉందని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా వాయిస్ లేదనే విధంగా పలువురు తెలియజేస్తున్నారు. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వేణు పాత్ర గురించి మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ హీరో పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: