మాస్ మహారాజా రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించగా , దివ్యాంశ కౌశిక్ , రాజేష విజయన్ ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. వేణు తొట్టెంపూడి ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ జూలై 29 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర తీవ్రమైన నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి ప్రస్తుతం మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు. దానితో ఈ మూవీ కి తీవ్ర నష్టాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఈ సినిమా 18 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4.97 కోట్ల షేర్ 8.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే ఇంకా 13.03 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయాలని ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: