ప్రభాస్ హీరోగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకేసారి నాలుగైదు సినిమాలను చేస్తూ ఉండడం తో ఆ చిత్రాలకు సంబంధించిన మేకోవర్ మెయింటెన్ చేయడంలో ప్రభాస్ ఎంతో కష్టపడుతున్నాడట. ఒక చిత్రంలో ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్న ప్రభాస్ ఇంకొక చిత్రం లో సాఫ్ట్ పాత్ర లో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఆ విధంగా ఈ రెండు పాత్రలకు తన మేకవర్ విషయంలో డిఫరెన్స్ చూపించడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నాడు. ఆ క్రమంలో ఆ మధ్య ఆయన లావుగా మారి కొంత వికారంగా కనిపించడం ఆయన అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

దానికి తోడు కొంతమంది ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వారిని మరింత బాధ పెట్టింది. సినిమా లోని పాత్ర కోసమే ప్రభాస్ ఈ విధం గా మేకోవర్ అయ్యాడని చెప్పుకొచ్చారు. అయినా కూడా ఆయనకు వయసు అయిపోయింది, గ్లో పోయింది అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ అందరిని ఎంతగానో త్రోల్ చేశారు త్రోలర్స్. అయితే  తాజాగా ఆయన ఓ సినిమా ఆడియో సందర్భంగా కనిపించిన తీరు చూసి ఆ ట్రోలర్స్ తమ నోళ్లు మూసుకున్నారనే చెప్పాలి.

గతంలో ప్రభాస్ ఎంత హ్యాండ్సమ్ గా ఎంత క్యూట్ గా కనిపించాడో అదే రీతిలో ఆ సినిమా యొక్క ఫంక్షన్ లో కనిపించి తన పై వస్తున్న త్రోల్స్ కి సమాధానం చెప్పాడు. ఏదేమై నా ప్రభాస్ అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టి డార్లింగ్ మరొకసారి తన సత్తా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఆయన హీరో గా మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.ఈ చిత్రా న్ని కొంత భాగం పూర్తిచేసిన ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొం టున్నాడు. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే చేసిన ఆది పురుష్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: