టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నిఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే తాజాగా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా కార్తికేయ 2.ఇకపోతే వీరి కలయిక లో వచ్చిన ఈ  సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈనెల 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా ఎన్నో అవరోధాలను తొలగించుకొని ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పరుగులు పెడుతుంది.

పోతే ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా మానియనే నడుస్తోంది.ఇదిలావుంటే సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత తిరిగి ఆ సినిమాని డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే నిఖిల్ కార్తికేయ 2 సినిమా డిజిటల్ రైట్స్ ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 భారీ ధరలకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాని థియేటర్ లో విడుదల అయ్యి ఆరువారాలను పూర్తి చేసుకున్న తర్వాత

ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ సానుకూలంగా ఉన్నారని చెప్పాలి.ఇకపోతే నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా 2014లో కార్తికేయ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే  ఇక ఇందులో హీరోయిన్ కలర్స్ స్వాతికి బదులు అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇకపోతే  ఈ సినిమా మంచి హిట్ కావడంతో నిఖిల్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: