ప్రస్తుతం ఒక సినిమాను ఒకే భాగం లో ఇమిడించడానికి దర్శకుడు చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. పెరిగిన కాన్వాస్ దృష్ట్యా, హీరోలకు పెరిగిన క్రేజీ దృష్ట్యా ఒక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం జరుగుతుంది. గతంలో ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా లేదు. కానీ ఇటీవల కాలంలో ఈ విధమైన ట్రెండు రోజురోజుకు పెరిగిపోతుంది. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు రాబోయే రెండు భాగాల చిత్రాలు ఏవో ఒక్కసారి తెలుసుకుందాం.

బాహుబలి సినిమా మొదటగా రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం అని చెప్పాలి. ఈ సినిమా యొక్క రెండు భాగాలు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి ఒక కొత్త ట్రెండుకు మార్గాన్ని వేసింది. ఆ తరువాత అంతటి స్థాయిలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా పుష్ప ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ముందుగా రెండు భాగాలు అని ఎవరు అనుకోలేదట. ఆ తర్వాత స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని వారు భావిస్తున్నారు. 

ఇప్పటికే మొదటి భాగం సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రెండవ భాగాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. ఇకపోతే ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న బింబిసారా చిత్రం కూడా రెండవ భాగం చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు. హీరో కళ్యాణ్ రామ్సినిమా పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండటమే ఈ విధంగా రెండవ పార్టు ప్రేక్షకులు ముందుకు రావడానికి ఈ కారణం అవుతుంది. ఇక నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా కూడా ప్రేక్షకులను అలరించి మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. మరి పార్ట్ 2 సినిమాలు మంచి సక్సెస్ లు సాధిస్తున్న నేపథ్యంలో వచ్చే సినిమాలు పెద్ద హిట్ అవుతాయా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: