బాలీవుడ్ హీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ముద్దుగుమ్మ నోరా ఫతెహి. ఇక ఎన్నో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది ముద్దుగుమ్మ. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు ఇమే ఎన్నో సినిమాలు ఐటెం సాంగ్లలో కూడా నటించింది. ఇదంతా ఇలా ఉంటే ఇండస్ట్రీలో రాణించాలంటే అంత సులువైన పని కాదు ఎంతో కష్టపడితే గాని సక్సెస్ తగ్గడం కష్టమని తెలియజేస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటే తప్ప బాలీవుడ్లో ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని తెలియజేస్తోంది.


నోరా ఒక బెస్ట్ డాన్సర్ అని కూడా చెప్పవచ్చు.ఈ విషయాన్ని ఆమె వేసిన డాన్స్ వీడియోలను చూస్తే ఎవరైనా ఒప్పుకోక తప్పదు.. ఇక స్పెషల్ సాంగ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ డాన్స్ ఫిదా అవ్వరని ప్రేక్షకులు ఉండాలని చెప్పవచ్చు. మొదట ఐటెం సాంగ్లు నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది అలా తెలుగులో అఖిల్ సినిమాలో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాలో కూడా నటించింది నోరా ఫతేహి.


ఇక తర్వాత టెంపర్, బాహుబలి, కిక్-2 వంటి సినిమాలలో ఐటెం సాంగ్ లో కూడా నటించింది ప్రస్తుతం బాలీవుడ్లో బెస్ట్ డాన్సర్ గా రాణిస్తున్నది.. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తన చిన్న వయసును నుండి తనకి డాన్స్ అంటే చాలా ఇష్టమని.. అలా పెద్ద డాన్సర్ కావాలని కలలు కనేదట కానీ ఈమె డాన్సర్ గా ఉండడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదట.. అందుచేతనే తనని ఎక్కువగా చదువుకోమనే వారిని తెలిపింది. అయితే డాన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఒకసారి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయానని అప్పుడు తన తల్లి చేతిలో చాలాసార్లు దెబ్బలు తినాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: