తెలుగులో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మిగిలిన ఇండస్ట్రీలలో చాలా సీజన్లు జరిగాయి..కానీ తెలుగులో మాత్రం 5 సీజన్లు పూర్తి చేసుకొని ఇటీవల ఆరో సీజన్ ను మొదలు పెట్టారు.. ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది..ఇప్పుడు నాలుగో వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారా అని అందరిలో ఆసక్తి మొదలైంది..అందుకు సంబందించిన నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.గతంలో ప్రసారం అయిన షో లతో పోలిస్తే ఈ షో కాస్త ఇంట్రెస్ట్ గా ఉందని తెలుస్తుంది.ఎందుకంటే హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ యూత్ కావడం విశేషం..ఈ షో పై బయట కామెంట్స్ కూడా అందుకుంటుంది..కొందరు పాజిటివ్ టాక్ ను ఇస్తే.. మరి కొంతమంది మాత్రం నెగిటివ్ టాక్ ను అందిస్తున్నారు.తాజాగా ఈ షో పై బిగ్‌బాస్ షోకి ఎంత పాపులారిటీ ఉందో, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతే వ్యతిరేకత కూడా ఉంది. బిగ్‌బాస్ షోని సిపిఐ నారాయణ అయితే ఇప్పటికే చాలా సార్లు వ్యతిరేకించారు.

షోని దారుణంగా విమర్శించారు. కుదిరినప్పుడల్లా ఆ షోని విమర్శిస్తూనే ఉంటారు. దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం స్పందించలేదు. తాజాగా సిపిఐ నారాయణ మరోసారి బిగ్‌బాస్ పై తీవ్ర విమర్శలు చేశారు.ఇటీవల నల్గొండలో వ్యభిచారం చేస్తున్నారని ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. ఈ ఘటనపై సిపిఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో బిగ్‌బాస్ ని ముడిపెట్టారు.వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు. బిగ్‌బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్‌బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే కదా. మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ సభ్యులకి కూడా గుండు కొట్టించండి అని తీవ్రంగా మండిపడ్డారు. సామాన్య మహిళలకి గుండు కొట్టించి అవమానిస్తారు కానీ బిగ్‌బాస్ షోలని మాత్రం ప్రోత్సహిస్తారు ఇదేం న్యాయం అని నారాయణ ప్రశ్నించారు.ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: