తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పౌరాణిక మరియు చారిత్రక సినిమాలను తెరకెక్కించే దర్శకుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది అని చెప్పవచ్చు.  ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పౌరాణిక మరియు చారిత్రక సినిమాలను తెరకెక్కించడంలో మంచి గుర్తింపు పొందిన దర్శకులలో గుణశేఖర్ ఒకరు. గుణశేఖర్ ఇప్పటికే అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి అనే సినిమాను తెరకెక్కించి  ప్రేక్షకుల నుండి ...  విమర్శకుల నుండి మంచి ప్రశంసలను పొందడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రుద్రమదేవి సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గుణశేఖర్ 'శకుంతలం' అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో సమంత నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి సమంత కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.  

ఇది ఇలా ఉంటే శకుంతలం మూవీ తర్వాత గుణశేఖర్ ,  రాణా ప్రధాన పాత్రలో హిరణ్య కశిప అనే మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు , సురేష్ ప్రొడక్షన్స్మూవీ ని నిర్మించ బోతున్నట్లు గత కొంత కాలంగా అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హిరణ్య కశిప మూవీ కి గుణశేఖర్ కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,  రానా హీరోగా హిరణ్య కశిప మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: