యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ గా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మూవీ లో మరో నటించాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు.

మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి దాదాపు 9 భాషలలో విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే కొరటాల శివ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'కే జి ఎఫ్' మూవీ తో దేశ వ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 31 మూవీగా తెరకెక్కబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతుంది. ఈ మూవీ పిరియాడిక్ డ్రామా కథతో తెరకెక్కబోతున్నట్లు ,  అలాగే ఈ మూవీ లో హీరో గాను మరియు విలన్ గాను రెండు పత్రాలలోనూ జూనియర్ ఎన్టీఆర్ కనిపించ బోతున్నాడు , అని ఒక టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త కనక నిజం అయితే ఎన్టీఆర్ అభిమానులకు ఈ వార్త అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: